థియేటర్లో కూర్చున్నంత సేపు ఆడియెన్స్‌ని నవ్విస్తాం..

by Mallepaka Hamsa |

శర్వానంద్(Sharwanand) హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari ).

థియేటర్లో కూర్చున్నంత సేపు ఆడియెన్స్‌ని నవ్విస్తాం..
X

దిశ, సినిమా: శర్వానంద్(Sharwanand) హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari ). ఈ మూవీలో సంయుక్త(Samyuktha Menon), సాక్షి వైద్య లు హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara)ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju)ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘‘ఇదొక పండుగ మూవీ. సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది వర్కౌట్ అవుతుంది. మేం అనుకున్నట్టుగానే ‘నారీ నారీ నడుమ మురారి’ రాబోతుంది .

ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిది. థియేటర్లో కూర్చున్నంత సేపు ఆడియెన్స్‌ని నవ్విస్తాం. బాలయ్య గారితోనే మా టైటిల్‌ను ఓపెన్ చేయించాం. మేం పాటని పూర్తిగా వాడలేదు. కేవలం కొన్ని పదాలనే వాడుకున్నాం. సినిమాలో ఓ మంచి పాత్ర పడింది. ఆ కారెక్టర్‌కి మాకు అందుబాటులో ఉండే హీరో శ్రీ విష్ణు కాబట్టి ఆయన్ను అడిగాం. ఆ పాత్ర వచ్చినప్పుడు థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ కారెక్టర్ ఆద్యంతం నవ్విస్తుంది. వారి కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఓ పెద్ద హీరో వచ్చి హడావిడి చేసినట్టుగా కాకుండా.. మనలోంచి ఓ సాధారణ మనిషి వచ్చి ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపిస్తుందని అన్నారు.

Next Story