- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి సినిమాపై కొడుకు రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తాజాగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ పై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి అత్యుత్తమ వినోదాన్ని అందిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ ఇద్దరిని కలిపి తెరపై చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. అనిల్ రావిపూడి గారు మరియు మొత్తం బృందానికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.
Read More..
మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. బిగ్ సర్ప్రైస్ ప్లాన్ చేసిన పెద్ది టీమ్






