- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' దేశముదురు’ రీ రిలీజ్ షో ఆపేసిన పోలీసులు
ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది

X
దిశ, సినిమా: ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల హిట్ మూవీలు రిలీజ్ అవుతూ అభిమానులను ఆనందింపజేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ ‘దేశముదురు’ సినిమా రీ రిలీజ్ చేశారు. ఈ నెల 8న బన్నీ బర్త్ డే అయినప్పటికీ.. రెండు రోజుల ముందుగానే ఈ సినిమాను 6న రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్‌లోనే టపాసులు పేల్చి హల్ చల్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో జరిగింది. ఫ్యాన్స్‌ను ఆపడానికి పోలీసులు రంగంలోకి దిగి షోను ఆపేశారు. ఇది తెలుసుకున్న ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్.. దయచేసి థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఫ్యాన్స్‌ను కోరారు. అలాగే దేవాలయాల్లాంటి థియేటర్‌లను రక్షించాలంటూ ట్వీట్ చేశాడు.
Next Story






