ప్రభాస్ స్పిరిట్ లో ఇంటర్వెల్ ట్విస్ట్..గూస్ బంప్స్ రావాల్సిందే?

by velandi.Saikiran |

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్.

ప్రభాస్ స్పిరిట్ లో ఇంటర్వెల్ ట్విస్ట్..గూస్ బంప్స్ రావాల్సిందే?
X

దిశ‌, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మొన్న సంక్రాంతి కానుకగా రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మంచి హిట్ ఇచ్చేందుకుగాను, చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నారు.

అయితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఓ కేసును ఛేదించే క్రమంలో హీరో ప్రభాస్ అలాగే విలన్ కు మధ్య ఉన్న సంబంధం ఇంటర్వెల్ లో రివీల్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్టు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందట. ఈ ట్విస్టు కచ్చితంగా అభిమానులకు బాగా నచ్చుతుందని అటు మేకర్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా మార్చి 5, 2027లో రిలీజ్ కానుంది.

Next Story