అడ్వెంచర్ కి రెడీ అవుతున్న మహేష్, రాజమౌళి...!

by Disha Web Desk 1 |
అడ్వెంచర్ కి రెడీ అవుతున్న మహేష్, రాజమౌళి...!
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకున్న రాజమౌళి, తెలుగు సినిమా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ మారిపోయారు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సాధించి దేశంలో తాను నెంబర్ వన్ అత్యుత్తమ దర్శకుడిగా నిలవడంతో పాటు టాలీవుడ్ ని కూడా నెంబర్ వన్ పోజీషన్ లో నిలపిన ఘటన రాజమౌళిది. ఈ నేపథ్యంలో రాజమౌళి తరువాత సినిమాపై ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలను రాజమౌళి అందుకుంటాడా లేదా అనేది ఓ ప్రశ్నాగా మిగిలింది.

రాజమౌళి నెక్ట్స్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉందనే విషయం తెలిసిందే. ఈ జక్కన్న సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అడ్వెంచర్ మూవీ కావడంతో అందులో పనిచేసే వారు కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్‌ అడ్వెంచర్‌ కథతో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో రాజమౌళి మూవీని తెరకెక్కించబోతున్నారు. అదేవిధంగ ప్రపంచ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. సినిమా బిజినెస్‌ కోసం ఇప్పటికే ఆయన హాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి.

ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. షూటింగ్ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావాల్సి ఉంది. వచ్చే సెప్టెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ మూవీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ లో త్రివిక్రమ్ షూటింగ్ పూర్తవగానే.. రాజమౌళి సినిమా ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

Read more: ' దేశముదురు’ రీ రిలీజ్ షో ఆపేసిన పోలీసులు

Yash: యష్.. కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్



Next Story

Most Viewed