అనన్య పాండేకు చేదు అనుభవం.. అందరి ముందే ఆ పార్ట్‌పై చేయి వేసిన వ్యక్తి

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-19 15:32:21  IST  )

ఫొటోలకు పోజులు ఇస్తున్న క్రమంలోనే అతను ఆమె నడుముపై చేతులు వేసి గిల్లాడు. అతను అలా చేయడంతో అనన్య పాండే ఒక్కసారిగా చాలా అసౌకర్యానికి గురైంది. తన బాడీ లాంగ్వేజ్‌లోనే ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.

అనన్య పాండేకు చేదు అనుభవం.. అందరి ముందే ఆ పార్ట్‌పై చేయి వేసిన వ్యక్తి
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండేకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో ఒక గ్రాండ్ ఫ్యాషన్ షోకి అనన్య పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె షోస్టాపర్‌గా వ్యవహరించి, వేదికపై అద్భుతమైన డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఎంతగానో అలరించింది. అయితే షో అంతా సజావుగానే ముగిసినప్పటికీ, ఆఖర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. షో పూర్తి అయిన తర్వాత డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి అనన్య పాండే వేదికపైకి వచ్చి మీడియా వాళ్లకు ఫోటోలు ఇస్తోంది. ఆ సమయంలో గౌరవ్ గుప్తా అనన్యతో కాస్త అతిగా చనువు ప్రవర్తిస్తూ కనిపించాడు. ఫొటోలకు పోజులు ఇస్తున్న క్రమంలోనే అతను ఆమె నడుముపై చేతులు వేసి గిల్లాడు. అతను అలా చేయడంతో అనన్య పాండే ఒక్కసారిగా చాలా అసౌకర్యానికి గురైంది. తన బాడీ లాంగ్వేజ్‌లోనే ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.

అయితే వందల మంది చూస్తున్న వేదికపై ఉండటం వల్ల, ఆమె పరిస్థితిని చాలా హుందాగా హ్యాండిల్ చేసింది. ఏమాత్రం సహనం కోల్పోకుండా, పైకి నవ్వుతూనే మెల్లగా అతని పక్క నుండి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి గొడవ చేయకుండా గౌరవ్‌ను అభినందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు ఫ్యాషన్ డిజైనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంత పెద్ద హీరోయిన్ అని కూడా చూడకుండా బహిరంగంగా అలా ప్రవర్తించడం చాలా తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ కష్ట సమయంలో అనన్య పాండేకు మద్దతుగా నిలుస్తూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పరిస్థితిని చాలా చక్కగా ఎదుర్కొందని మెచ్చుకుంటూనే, ఆ డిజైనర్ వెంటనే అనన్యకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story