శ్రీలీల షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన క్రేజీ బ్యూటీ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-18 05:52:44  IST  )

శ్రీలీలకు అవకాశాలు రాక ఖాళీగా ఉందా అంటే.. అస్సలు కాదు! ఆమె కావాలనే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

శ్రీలీల షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన క్రేజీ బ్యూటీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతోంది. అయితే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ వద్ద అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. సరైన భారీ హిట్ పడకపోవడంతో ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈక్రమంలో.. శ్రీలీల ఒక ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో రోజుకు రెండు షిఫ్ట్‌లు మారుస్తూ, అస్సలు క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరకు కొన్నాళ్ల పాటు దూరం కాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త తెలియడంతో ఈ డ్యాన్సింగ్ క్వీన్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. అయితే శ్రీలీలకు అవకాశాలు రాక ఖాళీగా ఉందా అంటే.. అస్సలు కాదు! ఆమె కావాలనే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సినిమాల్లోకి రాకముందే శ్రీలీల ఎంబీబీఎస్ (MBBS) చదువుతోంది. గతంలో షూటింగుల బిజీ వల్ల సరిగ్గా చదువుకోలేక, పరీక్షలను కూడా వాయిదా వేసుకుంది. ఇటీవల డాక్టర్ పట్టా పొందిన శ్రీలీల ఇప్పుడు తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే.. చదువుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యిందట. హడావుడిగా సినిమాలు చేయడం కంటే, ప్రస్తుతం తన దృష్టినంతా చదువుపైనే పెట్టాలని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆమె అభిమానులు కాస్త అప్సెట్ అయినప్పటికీ, ఇది ఆమె భవిష్యత్తుకు మంచిదేనని భావిస్తున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత, మళ్లీ సరికొత్త కథలతో, మంచి ప్రాజెక్ట్‌లను ఎంచుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందట.

డేటింగ్ వార్తలపై హీరోయిన్ శ్రీలీల క్లారిటీ !

వాడి గర్వం అణచడానికే ఆ పని చేశా.. అసలు వషయాన్ని చెప్తూ రష్మిక షాకింగ్ కామెంట్స్

Next Story