- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేటింగ్ వార్తలపై హీరోయిన్ శ్రీలీల క్లారిటీ !
కుర్ర క్రికెటర్ తిలక్ వర్మ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మధ్య డేటింగ్ రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కుర్ర క్రికెటర్ తిలక్ వర్మ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మధ్య డేటింగ్ రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత మెరిశారు. ఈ క్రమంలో తిలక్ వర్మ, శ్రీలీల మధ్య ఏదో ఉందని జోరుగా ప్రచారం అందుకుంది. అదే సమయంలో తిలక్ వర్మ ప్రేమలో ఉన్నాడని సూర్య కుమార్ యాదవ్ సరదాగా వ్యాఖ్యానించిన వీడియో కూడా ఒకటి వైరల్ గా మారింది.
దీంతో తిలక్ మనసులో ఉంది శ్రీలీలనే అని ప్రచారం మరింత జోరుగా సాగింది. ఇలాంటి క్రమంలో ఈ డేటింగ్ వార్తలను శ్రీలీల బృందం ఖండించింది. కనీసం తిలక్ వర్మ, శ్రీలీల ఇద్దరు ఇప్పటి వరకు ఒకరినొకరు కలుసుకోలేదని వెల్లడించింది. దీంతో డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లయింది. కాగా, శ్రీలీల ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అటు తిలక్ వర్మ భారత జట్టులో కొనసాగుతూనే, ఇటు ఐపీఎల్ లో ముంబై తరఫున అదరగొడుతున్నాడు.






