- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాడి గర్వం అణచడానికే ఆ పని చేశా.. అసలు వషయాన్ని చెప్తూ రష్మిక షాకింగ్ కామెంట్స్
ఆడపిల్లలు అస్సలు పెయిన్ భరించలేరు. వాళ్లకు సూదులు అన్నా, ఇంజెక్షన్లు అన్నా చాలా భయం.. అసలు తట్టుకోలేరు" అంటూ కాస్త ఎగతాళిగా మాట్లాడాడట.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా రష్మిక కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రిప్లేసబుల్’ అనే టాటూ గురించి గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ టాటూ ఆమె విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్లు పలు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ఆ టాటూ వెనుక ఉన్న అసలైన నిజాన్ని, దానికి గల బలమైన కారణాన్ని బయటపెట్టింది.అసలు తనకు మొదట్లో బాడీపై ఎలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదని చెప్పింది. కానీ ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకుంది. ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి రష్మిక దగ్గరకు వచ్చి, "ఆడపిల్లలు అస్సలు పెయిన్ భరించలేరు. వాళ్లకు సూదులు అన్నా, ఇంజెక్షన్లు అన్నా చాలా భయం.. అసలు తట్టుకోలేరు" అంటూ కాస్త ఎగతాళిగా మాట్లాడాడట.
ఆ మాటలు రష్మికకు ఒక ఛాలెంజ్‌లా అనిపించాయి. ఆడవాళ్లు దేనికైనా సిద్ధమేనని, ఎంతటి నొప్పినైనా భరించగలరని ఆ అబ్బాయికి నిరూపించడం కోసమే ఎలాగైనా టాటూ వేయించుకోవాలని వాడి గర్వం అణచడానికే టాటూ వేసుకున్నట్లు తెలిపింది. అయితే మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత చేతిపై ఏం రాయించుకోవాలా అని రష్మిక చాలాసేపు ఆలోచించిందట. తన జీవితంలో ఎప్పుడూ చాలా రియల్‌గా, ఎలా ఉందో అలాగే ఉండాలని ఆమె చెప్పింది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని ఆమె బలంగా నమ్ముతుందట. మనందరం మనదైన శైలిలో ప్రత్యేకం అని చెప్పడమే ఆ పదం ముఖ్య ఉద్దేశం. ఆ విషయాన్ని ప్రతిరోజూ తనకు తాను గుర్తుచేసుకోవడానికి, అలాగే తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఒక మంచి గోల్ లాగా పెట్టుకోవడానికి ‘ఇర్రిప్లేసబుల్’ అనే పదాన్ని టాటూగా మార్చుకున్నట్లు రష్మిక స్పష్టం చేసింది.






