- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాక్‌టైల్-2’ ఈవెంట్‌లో నోరుజారిన రష్మిక.. కృతిని అంత మాట అనడంతో నెటిజన్లు షాక్
ఈ వేడుకల్లో పాల్గొన్న రష్మిక నోరు జారి బూతు పదం పలకడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక, కృతి సనన్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘కాక్‌టైల్-2’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాక్‌టైల్’కు సీక్వెల్‌గా రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తుండగా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన చిత్రబృందం ఓ సాంగ్ లాంచ్ చేయగా.. ఈ వేడుకల్లో పాల్గొన్న రష్మిక నోరు జారి బూతు పదం పలకడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రష్మిక తన కోస్టార్ కృతి సనన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. అనకూడని మాట అనేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘కాక్‌టైల్-2లో ఏదొ ఒక కొత్త దనం ఉంది.
కృతి నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అండ్ యూ ఆర్ ఫింగ్ హట్ అని అనేసింది. కానీ వెంటనే తాను బూతు మాట అన్నానని గుర్తించిన నేషనల్ క్రష్ వెంటనే తన చేతులతో నోరు మూసుకుంది. అంతేకాకుండా తన తప్పును సరిచేసుకుంది. సారీ చెబుతూ.. దాన్ని సైలెన్స్ సెన్సార్ చేసయేయండి అని హిలేరియస్‌గా కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆమె చాలా అమేజింగ్.. లుక్ ఎట్ హర్, మా మధ్య చాలా ఎక్కువ ప్రేమ నడుస్తోందని తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రష్మిక వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కాస్త హద్దులు దాటి ప్రవర్తించిందని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం తన అభిప్రాయం చెప్పడం తప్పు కాదని సమర్థిస్తున్నారు.






