Katrina Kaif :కత్రిన భర్తని గెంటేసిన సల్మాన్ సెక్యూరిటీ

by Prasanna |   ( Updated:2023-09-09 14:03:57.0  )
Katrina Kaif :కత్రిన భర్తని గెంటేసిన  సల్మాన్ సెక్యూరిటీ
X

దిశ, సినిమా: తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ ఓ ఈవెంట్ లో అడుగుపెడుతూనే, కత్రినా కైఫ్ భర్త యువ హీరో విక్కీ కౌశల్ కు ఒక హగ్ ఇచ్చాడు. ఇంతలోనే సల్మాన్ గార్డులు విక్కీని నెట్టేసినట్లు ఓ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది. అయితే మెగా షో గ్రీన్ కార్పెట్ వద్ద మీడియాతో మాట్లాడిన విక్కీ..ఈ వీడియోలో కనిపించే విషయాలన్నీ నిజాలు కాకపోవచ్చని ధీటైన సమాధానమిచ్చాడు. ‘చాలా సార్లు అనవసర విషయాలు హల్ చల్ చేస్తుంటాయి. దాని గురించి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీడియోలో కనిపించేది వేరు. వాస్తవాలు వేరు. దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు’ అని విక్కీ అన్నాడు.

Advertisement

Next Story