బాలీవుడ్ రహస్యాలన్నీ బయటపెడతా: కరణ్ జోహార్

by Chukka Sudharani |   (  Updated:2022-09-10 10:18:10  IST  )

బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాలీవుడ్ రహస్యాలన్నీ బయటపెడతా: కరణ్ జోహార్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాఫీ విత్ కరణ్ షోలో హీరో, హీరోయిన్స్‌ల సెక్స్ లైఫ్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ క్వశ్చన్స్‌తో వారికి చెమటలు పట్టిస్తున్నాడు. ఇదే క్రమంలో మరో సంచలనానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు సంబంధించిన రహస్యాలను బయటపెటతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అది కూడా ఓ వెబ్‌సిరీస్ ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అంటున్నాడు కరణ్. తాను ఓ కొత్త వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. అందులో ఎంటర్టైన్మెంట్‌తోనే, బిగ్ బిజినెస్ డీల్స్‌కు సంబంధించిన అనేక రహస్యాలు మీ ముందుకు తీసుకొస్తానని ప్రకటించాడు కరణ్ జొహార్. కాగా.. ఈ నూతన వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం అవుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : అక్కడ లిమిట్స్ దాటి.. ఆసుపత్రి బెడ్ ఎక్కిన Rakul Preet Singh ?


ఇవి కూడా చ‌ద‌వండి

మీరు ఊహించగలిగేదంతా నిజమే'.. అనన్య మి

సూర్య 42'లో ఊహకందని అంశాలు: ఎగ్జయిట్‌ అవుతున్న దిశా

Next Story