రికార్డు సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. అక్కడ సోలో హీరోగా సెన్సేషన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-06 12:56:51  IST  )

దక్షిణాది సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

రికార్డు సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. అక్కడ సోలో హీరోగా సెన్సేషన్
X

దిశ, సినిమా: దక్షిణాది సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అక్కడ ఒక భారతీయ నటుడికి దక్కుతున్న గౌరవం చూస్తుంటే ప్రభాస్(Prabhas) క్రేజ్ ఏ రేంజ్‌కు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ సినిమాతో జపనీస్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రభాస్ అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ 'అనాన్' (Anan) కవర్ పేజీపై ప్రభాస్ దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాగజైన్ కవర్‌పై సోలోగా కనిపించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.

గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు ప్రభాస్ ఒంటరిగా ఆ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ నెల 10 విడుదల కానున్న ఆ మ్యాగజైన్‌లో ప్రభాస్’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిని అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రభాస్ అభిమానులు "అదీ డార్లింగ్ రేంజ్" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు భారతీయ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటుతున్నాయి.

Rajasaab OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన 'రాజాసాబ్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

అయ్యగారికి తప్పని రిలీజ్ టెన్షన్.. చరణ్ కోసం వెనక్కి తగ్గిన ‘లెనిన్’

Next Story