- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయ్యగారికి తప్పని రిలీజ్ టెన్షన్.. చరణ్ కోసం వెనక్కి తగ్గిన ‘లెనిన్’
అక్కినేని అఖిల్ (Akkineni Akhil)తన కెరీర్‌లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ‘లెనిన్’ చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ (Akkineni Akhil)తన కెరీర్‌లో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ‘లెనిన్’ చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామా కోసం అఖిల్ తన లుక్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు చాలా మార్పులు చేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో మే 1, 2026న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 30న రామ్ చరణ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’(peddi)వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ‘లెనిన్’ విడుదల తేదీ డైలమాలో పడింది. చరణ్ వంటి స్టార్ హీరో సినిమాకు కేవలం ఒక్కరోజు గ్యాప్‌లో రావడం బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై, థియేటర్ల దొరకడంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘లెనిన్’ (lenin)మేకర్స్ తమ సినిమాను వాయిదా వేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ‘పెద్ది’ చిత్రానికి ఉన్న భారీ హైప్ దృష్ట్యా, అఖిల్ సినిమాకు సోలో రిలీజ్ దొరికితేనే అది బాక్సాఫీస్ వద్ద నిలబడగలదని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తున్నాయట. అందుకే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. రామ్ చరణ్, అఖిల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇప్పటికే ఈ క్లాష్‌పై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’ను మే మూడవ వారానికి లేదా జూన్ ఆరంభానికి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల్ సోలోగా వస్తేనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయగలడని అఖిల్ కెరీర్‌కి అది చాలా కీలకం అని నిర్మాతలు భావిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించే ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్. థమన్ సంగీతం అందిస్తున్నారు.






