థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ లోడింగ్..

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-05 12:09:26  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్‌కు మైత్రీ మూవీ మేకర్స్ బ్లాస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ లోడింగ్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్‌కు మైత్రీ మూవీ మేకర్స్ బ్లాస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) మ్యూజికల్ వర్క్ ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించి ఒక ఫోటోను విడుదల చేస్తూ.. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజికల్ బ్లాస్టింగ్ కోసం దేవిశ్రీ సిద్ధమవుతున్నాడు’’ అంటూ క్యాప్షన్ జత చేశారు చిత్రబృందం. గతంలో పవన్ - హరీష్ - డీఎస్పీ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మ్యూజిక్ ఒక ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా డీఎస్పీ అదిరిపోయే మాస్ బీట్స్‌ను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్‌కు తగ్గట్లుగా సాంగ్స్ ఉండాలని ఆయన డీఎస్పీతో కలిసి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) తో పాటు ‘దేఖ్‌లెంగా’ సాంగ్‌తో బాక్సులు బద్దలు కొట్టాడు దేవీశ్రీ. ఇక ఇప్పుడు మరో రెండు ఫుల్ లెంగ్త్ పాటలతో ఫ్యాన్స్‌కు మ్యూజికల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఆ రెండు పాటలు విడుదల కాబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, పవన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్స్‌లోకి రాబోతుంది.

వాయిదా పడిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Next Story