- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయిదా పడిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘స్కై’ చిత్రం వాయిదా పడినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించారు.

దిశ, సినిమా: ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘స్కై’ చిత్రం వాయిదా పడినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఫిబ్రవరి 6న ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడినట్లు తెలిపాడు. అలాగే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. ఫిబ్రవరి 13న ‘స్కై’ చిత్రం రిలీజ్ చేస్తుండగా.. విడుదల చేసిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్ రొమాంటిక్ స్టిల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌తో మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ‘స్కై’ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.






