- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయాన్ని పిక్నిక్ స్పాట్‌లా మార్చుకున్న భక్తులు
అమ్మవారి ఆరాధన భక్తి శ్రద్దలతో ప్రవచనాలు.. భజన సంకీర్తనలతో మారు మ్రోగాల్సిన ఆలయంలో రక్తి కట్టించే పాటలు డీజే డ్యాన్స్ లు అదర గోడుతున్నాయి.

దిశ, కరీంనగర్ బ్యూరో: అమ్మవారి ఆరాధన భక్తి శ్రద్దలతో ప్రవచనాలు.. భజన సంకీర్తనలతో మారు మ్రోగాల్సిన ఆలయంలో రక్తి కట్టించే పాటలు డీజే డ్యాన్స్ లు అదర గోడుతున్నాయి. ఓంకార నామ స్మరణతో అమ్మవారిని ఆరాదించాల్సిన భక్తులు అదరగొట్టే స్టెప్పులు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. కరీంనగర్ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల మాణికేశ్వరి మాత ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకోగా, ఆలయ పరిసరాల ప్రాంత భక్తులు వీరి వింతపోకడపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో భజనల పేరిట వార వారం ఆలయంలోకి వస్తున్న ఆలయ కమిటీకి చెందిన కుటుంబ సభ్యులు ఇలా దద్దరిల్లే సౌండ్స్‌తో డీజే సాంగ్స్‌పై వికృత నృత్యాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతుంది. ఆలయానికి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వీరి డీజే సౌండ్స్ ఇబ్బందికరంగా మారడంతో ప్రశ్నించిన భక్తులకు ఇది మా టెంపుల్ మా ఇష్టం అంటూ సమాధానం రావడంతో భక్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మన్నించు మాణికేశ్వరి మాత అంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు.






