- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajasaab OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'రాజాసాబ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
ది రాజా సాబ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ది రాజా సాబ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. మొన్న సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన రాజా సాబ్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. దీంతో 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేసింది.
మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్
ప్రభాస్ హీరోగా చేసిన రాజా సాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తమన్ సంగీత స్వరాలు అందించారు. ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్ , రిద్ది కుమార్, మాళవిక మోహనన్ తమ అందాలతో సినిమాకు హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మారుతి కాన్సెప్ట్ కొత్తదైనప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కలేదు. దీంతో సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు.






