పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో.. ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం!

by Mallepaka Hamsa |

తాను కూడా త్వరలోనే ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో.. ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. కొందరు అందరినీ పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం చడీ చప్పుడు కాకుండా సీక్రెట్‌గా పెళ్లిళ్లు చేసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా, ఇదే లిస్ట్‌లోకి టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ కూడా చేరిపోయాడు. నీవలెనే, బస్ స్టాప్ వంటి సినిమాలతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా క్రేజ్ దక్కించుకున్న ప్రిన్స్.. ఓ వైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌లోనూ పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సాయి మాచిరాజు అనే అమ్మాయితో గత నెల ప్రిన్స్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.

తాజాగా ఈ విషయానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తాను కూడా త్వరలోనే ఓ ఇంటివాడిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తామిద్దరం మొదటిసారి కలుసుకున్నామని, ఆ తర్వాత మంచి స్నేహితులమయ్యామని ప్రిన్స్ చెప్పారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని, నచ్చి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వీరి పెళ్లి ఈ ఏడాది ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో చాలా గ్రాండ్‌గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ద్వారానే సాయి మాచిరాజు, ప్రిన్స్‌లకు పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఎట్టకేలకు త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఈ జంటకు సినీ సెలబ్రిటీలతో పాటు, నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

Next Story