- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణ వెదర్‌మెన్ అంచనా: నేడు తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో నేడు కూడా నైట్ రెయిన్ స్పెల్!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా నేడు (జూలై 20) ఉత్తర, సెంట్రల్, తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకుడు 'తెలంగాణ వెదర్‌మెన్' అలర్ట్ జారీ చేశారు. ఆయన వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు విస్తారంగా వర్షాలు కురిసే వీలుంది. ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం తర్వాత ప్రయాణాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత, రాత్రి వేళల్లో అక్కడక్కడా చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ నగర విషయానికి వస్తే.. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తరహాలోనే, నేడు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో బలమైన వర్షపు జల్లులు (Night Rain Spell) కురిసే వీలుందని తెలంగాణ వెదర్‌మెన్ అంచనా వేస్తూ అలర్ట్ జారీ చేశారు.






