పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టించుకోని కొడుకులు.. న్యాయం కోసం అధికారులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

by Jakkula.Mamatha |

మాయమాటలు చెప్పి మా కొడుకులు ఇద్దరు మా పేరిట ఉన్న పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టించుకోని కొడుకులు.. న్యాయం కోసం అధికారులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ‘మాయమాటలు చెప్పి మా కొడుకులు ఇద్దరు మా పేరిట ఉన్న పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మమ్ములను పట్టించుకోవడం లేదు.. మీరే న్యాయం చేయాలి’ అని సోమవారం మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన అంజయ్య, రాములమ్మ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. మా పేరిట ఉన్న పొలాన్ని ఇద్దరు కొడుకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

మా పేరిట లక్ష రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు అన్ని విధాల అండగా ఉంటాము అని కొడుకులు ఇద్దరు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మాము. ఇప్పుడు వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇది ఏమీ న్యాయం అని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని దంపతులు వాపోయారు. ప్రస్తుతం నా భర్తకు పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు.. కూలి నాలి చేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి ఉంది. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి అని దంపతులు ఇరువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Next Story