- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ ఉమామహేశ్వర ఆలయంలో టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు
by Jakkula.Mamatha |
నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ శ్రీమతి ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేశ వేణు, ఇతర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story






