- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
by Taduka Kalyani |
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన మన్నే నర్సింహులు (48) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






