Oscar Awards 2023: ఆస్కార్లో హైలెట్ ఎవరు? ఎన్టీఆర్ (Or) రామ్ చరణ్

by Disha Web Desk 10 |
Oscar Awards 2023: ఆస్కార్లో  హైలెట్ ఎవరు? ఎన్టీఆర్ (Or) రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో చరణ్, తారక్ అభిమానులు రచ్చ చేయడం మాములే. ఒక వైపు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ మెగా, నందమూరి అభిమానులు మా హీరో అంటే మా హీరోనే హైలెట్ గా నిలిచాడంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది. జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, బ్లాక్ షూట్లో కనిపించారు. ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ హైలెట్ అయ్యారాని మెగా అభిమానులు, కాదు ఎన్టీఆర్ మాత్రమే హైలెట్ అయ్యారని నందమూరి అభిమానులు వారి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

కీరవాణి, చంద్రబోస్ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకుంటున్న సమయంలో స్పీచ్ అయిపోయే వరకు బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ పై కేవలం ఎన్టీఆర్ మాత్రమే హైలెట్ చేసారు. ఇదే ఇప్పుడు నందమూరి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఆస్కార్ నిర్వాహకులు ఎన్టీఆర్ ను మాత్రమే హైలెట్ చేసారంటూ అంటున్నారు. కానీ నిజానికి నామినేషన్ సమయంలో ఇద్దరూ పక్క పక్కనే ఉండి ఆ ప్రౌడ్ మూమెంట్ను ఎంజాయ్ చేసారు.

Read more:

అస్కార్ అవార్డ్స్‌లో ఉపాసన ఆ చీరే ఎందుకు కట్టుకుందో తెలుసా?

ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్ | ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్



Next Story

Most Viewed