ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్

by Disha edit |
ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్
X



తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. ఆస్కార్ పురస్కారం భారతీయ పాటకు, ముఖ్యంగా తెలుగు పాటకు దక్కటం తెలుగు నేలకు దక్కిన గౌరవం. ఈ అవార్డు తమకే దక్కినట్లు ప్రతి తెలుగు హృదయం పులకించిపోతోంది. విశ్వ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అంతే దీటుగా ముస్తాబైన డాల్బీ థియేటర్ వేదికపై స్వరవాణి కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డును ఆందుకున్న సమయంలో యావత్ భారత్ గర్వించగా తెలుగోడి హృదయం పులకరించి పోయింది. భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ప్రతివారిని స్పందింపజేసిన ఆ మ్యూజిక్ మేనియా గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు చెవులు సిల్లుపడేలా కీసుపిట్ట కూసినట్టు కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు, ఒళ్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు నాటునాటు యవ్వారం సాగిన తీరు అద్బుతం.

కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్‌ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఆస్కార్‌... ప్రపంచంలోని ప్రతి సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు ముద్దాడాలని చూసే పురస్కారం. ఈ సారి ఆ ఆస్కార్ పురస్కారం భారతీయ పాటకు ముఖ్యంగా తెలుగు పాటకు దక్కటం తెలుగు నేలకు దక్కిన గౌరవం. ఈ అవార్డు తమకే దక్కినట్లు ప్రతి తెలుగు హృదయం పులకించిపోతోంది. అంత సొంతమైపోయింది ఈ తెలుగు నాటునాటు పాట. భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ప్రతివారిని స్పందింపజేసిన ఆ మ్యూజిక్ మేనియా గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు చెవులు సిల్లుపడేలా కీసుపిట్ట కూసినట్టు కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు, ఒళ్ళు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు యవ్వారం సాగినతీరు అద్బుతం. సమైఖ్య కృషికి నిదర్శనం. ఈ తెలుగు నాటునాటు పాట ఆస్కార్ పురస్కారం దక్కించుకుని విశ్వ వేదికపై సగర్వంగా భారత దేశ కీర్తి పతాకని రెపరెపలాడించింది. యావత్ దేశం సంతోషంతో పులకరించి పోయింది.

పులకరించిన తెలుగు హృదయం

అందరి ఆశలను మోసుకుంటూ లాస్ ఏంజిల్స్‌లో అడుగు పెట్టిన నాటు నాటు ఆస్కార్ వేదికపై తెలుగు పదాల ఘాటుతో నాటు నాటు అంటు విశ్వ సినీ సంగీత ప్రియుల గుండెల్లో నాటుకుంది. నాటు నాటు పాట‌ను ఆస్కార్ అవార్డ్ వ‌రించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో నాటు నాటు చోటు దక్కించుకున్న దగ్గరనుంచి పురస్కారం ఆందుకునే వరకూ చరిత్ర సృష్టించింది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. విశ్వ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అంతే దీటుగా ముస్తాబైన డాల్బీ థియేటర్ వేదికపై స్వరవాణి కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్న సమయంలో యావత్ భారత్ గర్వించగా తెలుగోడి హృదయం పులకరించి పోయింది. వినూత్న దార్శనిక ప్రతిభతో ఖచ్చితత్వంతో రాజమౌళి కృషీ, తారక్, రాంచరణ్ అభినయ సమన్వయం ఈ పాటకు మరింత శోభను తెచ్చాయి.

నాటు నాటు వెనుక విశేషాలు

వీరంగం ఆడినట్టు యావత్ చిత్ర రంగాన్ని ఆశ్చర్యపరిచిన ఒరిజినల్ సాంగ్ నాటు నాటు పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ రామ్ చరణ్ వర్సెన్, కాలభైరవ ఎన్టీఆర్ వర్సెన్ అద్భుతంగా ఆలపించారు. దీనికి కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ నృత్యాలు సమకూర్చారు. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరు హీరోల స్టెప్స్ సింక్ అయ్యేలా 18 టేకులు తీసుకున్నారట, నాట్యం చేసే రీతిని, సమన్వయాన్ని, చిత్రీకరణలోని ప్రతి అంశాన్ని సూక్షాతి సూక్ష్మంగా పర్యవేక్షించిన రాజమౌళి చివరికి రెండో టేకు ఫైనల్ చేశారట. ఈ పాట చిత్రీకరణను ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు చిత్రీకరించారు. ఇందులో నాటి బ్రిటీష్ ఇండియాను ప్రతిబింబించే విధంగా సెట్టింగ్, రంగుల నుంచి పూల అలంకరణ వరకు ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ తీసుకున్నారు. ఉక్రెయిన్ డ్యాన్సర్స్, సంగీత కళాకారులు సైతం ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు ఈ పాటకు ఏడు రోజులు మాత్రమే రిహార్సల్స్ మాత్రమే చేశారు. 150 మంది డాన్సర్స్, 200 మంది నటీనటులు నాటు నాటులో నటించారు. దీనిని 17 రోజుల పాటు చిత్రీకరించారు.

పాటకు జయహో...

రమా రాజమౌళి నాటు నాటు పాటకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు హీరోల వస్త్రధారణ నుంచి పాటలో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారుని వస్త్రధారణ ఆమె రూపొందించినవే. షూటింగ్ సమయంలో దుమ్ము పడిన వస్త్రాలు సున్నితమైనవి కావడం వల్ల వాటిని ప్రత్యేకంగా శుభ్రపరచి మరుసటి రోజు షూటింగ్‌కు ఆందించేవారు. అది ఆవిడ ఖచ్చితత్వం పని పట్ల అంకితభావం. ఇన్ని ప్రత్యేకతలని సంతరించుకుని ప్రపంచవ్యాప్తంగా అందరి మనస్సులో నాటుకున్న నాటు నాటు పాటకు జయహో. ఆర్ఆర్ఆర్ టీం రానున్న రోజుల్లో భారతీయ సినిమా మరిన్ని అద్బుతాలు చేయాడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ ఆస్కార్ పురస్కారం.

తెలుగుకారం, మమకారం, నుడికారం

పల్లె పదాల పచ్చదనం గ్రామీణ వాతావరణ నేపథ్యం ప్రకృతితో మమేకమైన మానవ జీవన శ్రమైక సౌందర్యం. గ్రామీణ కళలు, చేతివృత్తులను ప్రస్తావిస్తూ తెలుగు కారాన్ని, మమకారాన్ని, నుడికారాన్ని ఇందులో చొప్పించిన చంద్రబోస్ పదజాలానికి మరకతమణి కీరవాణి బాణి మాస్‌ని, క్లాస్‌ని కూడా కదిలించింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు అనుభవించి పాడిన మాటల సారం మట్టి వాసనను గుబాళింపజేసింది. అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా కాకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి సఫలీకృతం చేసిన రాజమౌళీ స్టూడెంట్ నంబర్ వన్‍‌లా వినమ్రతతో వుండి రానున్నకాలానికి ఇతర దర్శకులకు మార్గదర్శకుడైనాడు. ఈ అవార్డుతో పాటు భారతీయ డాక్యుమెంటరీ కూడా ఆస్కార్ దక్కించుకోవడం భారతీయ సినిమాలో కొత్తదనానికి నాంది కాగలదు. స్పర్దయా వర్ధతే విద్య అన్న చందంగా భారతీయ సినిమాలోని అందరూ వారి వారి స్ధాయిలో ప్రయత్నిస్తే భారతీయ సినిమా విశ్వ యవనికపై మరిన్ని జిలుగులను విరజిమ్మగలదు.

వాడవల్లి శ్రీధర్

సీనియర్ జర్నలిస్టు

99898 55445



Next Story

Most Viewed