బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత

by Shamantha N |
బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ కన్నుమూశారు. గత కొంతకాలంగా సుశీల్ కుమార్ మోడీ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్నానని.. ఆరోగ్య సమస్యల వల్ల లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు గత నెలలో ప్రకటించారు.

మంగళవారం పాట్నా రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఆయన నివాసానికి సుశీల్ కుమార్ భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిహార్ మంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువులు బీజేపీ నాయకులు సుశీల్ మోడీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుశీల్ కుమార్ మోడీ మృతి బీజేపీకి తీరని లోటని.. బిహార్ మంత్రి సామ్రాట్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు.

72 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఆయన పదవీకాలం ముగిసింది.

Next Story

Most Viewed