అస్కార్ అవార్డ్స్‌లో ఉపాసన ఆ చీరే ఎందుకు కట్టుకుందో తెలుసా?

by Dishanational2 |
అస్కార్ అవార్డ్స్‌లో  ఉపాసన ఆ చీరే ఎందుకు కట్టుకుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా సత్తాచాటింది. తెలుగు ప్రజలు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేలా ఆస్కార్ అవార్డుతో త్రిబుల్ ఆర్ సినిమా తన సత్తా చాటింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్‌లో రామ్ చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ఉపాసన కట్టు బొట్టు అక్కడున్నవారందరినీ ఆకర్షించిది. అంతే కాకుండా అవార్డ్ ఫంక్షన్ తర్వాత ఉపాసనకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే నిన్న ఆమె పెట్టుకున్న నక్లెస్ పై అనేక వార్తలు నెట్టింట్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కట్టుకున్న చీరపై పలు కామెంట్స్ వినపడుతున్నాయి.

ఉపాసన భారతదేశ సంస్కృతికి అద్దం పట్టేలా శాంతికి చిహ్నంగా ఉండే తెలుపు రంగు చీరను కట్టుకొని ఆస్కార్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక తెలుపు శాంతికి చిహ్నం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఆమెకు హ్యాండ్ మేడ్ తయారీ చీరలంటే చాలా ఇష్టం అంట. అందుకే ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిసైనర్ తయారు చేసిని సారీని కట్టుకొని అవార్డ్ ఫంక్షల్లో నిలిచింది అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more:

ఉపాసనకు ఇప్పుడు ఆరో నెల.. నాబిడ్డనాకు ఇప్పుడే ఇంత అదృష్టం తెస్తుందంటూ..

Next Story

Most Viewed