- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్ 2 ఈవెంట్ లో బాలయ్యను అవమానించిన ఎన్టీఆర్.. ఇదిగో వీడియో ?
నాన్న, అమ్మ మాత్రమే ఉన్నారని గుర్తు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలయ్య పేరు మాత్రం ప్రస్తావించలేదు.

దిశ, వెబ్ డెస్క్ : వార్ 2 (War 2) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ( NTR) సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. మొదట ఈవెంట్ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్... ఆ తర్వాత ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. అలాగే.. నందమూరి బాలయ్యను అవమానించేలా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారని కూడా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వార్ 2 ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తోందని పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభంలో తన పక్కన ఎవరూ లేరని... కేవలం తమ నాన్న, అమ్మ మాత్రమే ఉన్నారని గుర్తు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలయ్య పేరు మాత్రం ప్రస్తావించలేదు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను కూడా గుర్తు చేసుకోలేదని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
అయితే 2001 సమయంలో... ఇండస్ట్రీలో తాను ఉండడానికి కారణం తన తాత, అలాగే బాలయ్య బాబాయ్, మా నాన్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సక్సెస్ కాకముందు కుటుంబాన్ని వాడుకొని... సక్సెస్ అయ్యాక సొంతంగా తానే పైకి వచ్చానని చెప్పడం హీరోలకు అలవాటైందని... జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఇలాగే వ్యవహరిస్తున్నాడని... కొంతమంది పోస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు.
Read More.. షాకింగ్ ఘటన.. రెండు విమానాలు ఢీ.. భారీగా ఎగసిపడిన మంటలు
War 2: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్... పచ్చి బూతులతో !
వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ కు అన్యాయం...మూవీలో ఎంట్రీ అప్పుడేనా?






