- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ కు అన్యాయం...మూవీలో ఎంట్రీ అప్పుడేనా?
వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారట

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా వార్ 2 (War 2). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అలాగే హృతిక్ (Hrithik Roshan) కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతగా ఆదిత్య చోప్రా వ్యవహరిస్తున్నారు. యష్ రాజు ఫిలిమ్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే... ఈ సినిమా నుంచి ఓసారి కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారట. అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ చివరి వరకు కనిపిస్తారని చెబుతున్నారు.
అంటే సినిమా ప్రారంభం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోరన్నమాట. అయితే ఇదే విషయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్.. సినిమా మొత్తం కనిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆగస్టు 14వ తేదీన... ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Read More..
War 2: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్... పచ్చి బూతులతో !






