- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
War 2: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్... పచ్చి బూతులతో !
ఎన్టీఆర్ తో రామ్ చరణ్ ను పోలుస్తారా అని ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : వార్ 2 సినిమా ఈవెంట్ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు ఇప్పటివరకు ఊపులో ఉన్న కూలీ సినిమాను కూడా వార్ 2 మూవీ డామినేట్ చేసేలా ఆదివారం రోజు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ కూడా కొనసాగింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న నేపథ్యంలో అభిమానులు బాగా అరిచారు.
దీంతో కాస్త సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్... అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. అరుపులు ఆపండి... నన్ను మాట్లాడనివ్వండి అంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. స్టేజ్ పైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పట్ల అలా వ్యవహరించడం దారణమని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మరికొంతమంది రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని తెలియజేసే ఓ వీడియోను షేర్ కూడా చేసి.. ఎన్టీఆర్ పరువు తీస్తున్నారు.
ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా అచ్చం ఇలాగే అభిమానులు రామ్ చరణ్ మాట్లాడుతుండగా అరిచారు. ఆ సమయంలో సీరియస్ కాకుండా వాళ్ళందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్ స్మూత్ గా మాట్లాడేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ గ్రేట్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ పోస్టర్ కింద.. రామ్ చరణ్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ తో రామ్ చరణ్ ను పోలుస్తారా అని ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.
Read More..
వార్ 2 ఈవెంట్ లో బాలయ్యను అవమానించిన ఎన్టీఆర్.. ఇదిగో వీడియో ?
వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ కు అన్యాయం...మూవీలో ఎంట్రీ అప్పుడేనా?






