- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ ఘటన.. రెండు విమానాలు ఢీ.. భారీగా ఎగసిపడిన మంటలు
ఓ పెద్ద విమానంపైకి చిన్న ప్రైవేట్ విమానం దూసుకొచ్చింది. రెండు విమానాలు ఒక్కసారిగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: అహ్మాదాబాద్ విమాన ప్రమాదం తర్వాత నుంచి వరుసగా విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు, సాంకేతిక లోపాలు వంటి సంఘటనలు చోటుచేసుకుంటూ ప్రయాణికుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని (America) మోంటానా (Montana) రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) రెండు విమానాలు ఢీకొన్నాయి. కాలిస్పెల్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విమానాశ్రయంలో నలుగురు ప్రయాణికులతో ఉన్న సింగిల్-ఇంజన్ విమానం దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ నియంత్రణ కోల్పోవటంతో రన్‌వేపై పార్క్ చేసిన విమానాలను ఢీకొట్టాడు. ఈ షాకింగ్ ఘటనతో పలు విమానాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆగి ఉన్న విమానంలో ప్రయాణికులు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అలాగే, ఢీ కొన్న విమానంలోని పైలట్ సహా నలుగురు ప్రయాణికులు వెంటనే బయటకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా, విమానాశ్రయ సిబ్బంది చికిత్స అందించారు. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఈ విమానం వాషింగ్టన్‌లోని పుల్‌మన్ నుంచి బయలుదేరినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) తెలిపింది. ఈ విమానం మీటర్ స్కై ఎల్‌ఎల్‌సి (Meter Sky LLC) కంపెనీకి చెందిన సొకాటా టీబీఎం 700 టర్బోప్రాప్‌గా (Socata TBM 700 turboprop) గుర్తించారు.






