- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసిమరీ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్..?
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబర్ స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ఈయన.. హాలీవుడ్ చిత్రాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రతి విషయంలో చాలా నిజాయితీగా ఉండే తారక్ తన తప్పు ఉందని తెలిస్తే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా క్షమించమని అడుగుతారట. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు ఫోన్ చేసి మరి క్షమించమని అడిగారట తారక్. ఎన్టీఆర్, రాజమౌళీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘యమదొంగ’.
ఈ మూవీలో ప్రియమణితో పాటు మమత మోహన్ దాస్ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలోని ‘‘ఓలమ్మి తిక్క రేగిందా’’ అనే పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ మమత బ్యాక్‌పై కొడతాడు. అయితే డైరెక్టర్ చెప్తేనే ఆ పని చేసినప్పటికీ మమతా ఫీల్ అయి ఉంటుందేమో అనుకుని ఎన్టీఆర్ ఫోన్ చేసి మరి ఆమెకు క్షమాపణలు చెప్పారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా మోహన్ దాస్ ఈ విషయం చెప్పడంతో.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read more:
బ్రిటన్ రాజు పట్టాభిషేక మహోత్సవానికి ఆ హీరోయిన్.. రికార్డ్ క్రియేషన్






