- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. ఆయన మొదటి మూవీ ఏందంటే?
నేడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు (22-08-1955). ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్.

దిశ, సినిమా: నేడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు (22-08-1955). ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్. తల్లిదండ్రులకు పెద్ద కొడుకైన చిరు ఇండస్ట్రీలోకి రావాలనే తాపత్రయంలో 1979లో ‘పునాదిరాళ్లు’ (Punadhirallu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1983లో ‘ఖైదీ’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. 1987లో చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నారు.
అదే సంవత్సరంలో 59 వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్ళి అందరి దృష్టిని ఆకర్శించారు. 2024లో సరిగ్గా అదేరోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరాడు. మొత్తం 156 చిత్రాల్లో నటించి మెగాస్టార్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 2008 నుంచి 2016 దాదాపు పదేళ్ల వరకు సినిమాలకు దూరం అయ్యారు.ఈ పదేళ్ళలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. మళ్లీ 2013లో ‘ఖైదీ-150’ చిత్రం చేశారు. చిరు ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు. 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న మెగాస్టార్ విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నారు. అలాగే ఓ బ్లడ్ బాంక్‌ను సైతం నడుపుతూ ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడుతూ దేవుడిలా మారిపోయారు. త్వరలో ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read More..
సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్






