హీరో నందమూరి బాలకృష్ణకు గాయం.. దర్శకుడు గోపీచంద్ మలినేలి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్‌లో గాయమైంది.

హీరో నందమూరి బాలకృష్ణకు గాయం.. దర్శకుడు గోపీచంద్ మలినేలి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న మూవీలో హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) మోకాలికి గాయమైంది. కాకినాడ పోర్ట్ ఏరియాలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం బాలకృష్ణను మూవీ యూనిట్ హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, తాజాగా షూటింగ్‌లో బాలకృష్ణ గాయంపై దర్శకుడు గోపీచంద్ మలినేని వివరణ ఇచ్చారు. యాక్షన్ సీన్‌లో బాలకృష్ణ మసిల్ టియర్ అయిందని.. ఓ చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుందని అన్నారు. నందమూరి బాలకృష్ణ త్వరలోనే కొలుకుంటారని.. అభిమానులెవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని గోపీచంద్ మలినేని రిక్వెస్ట్ చేశారు.

Next Story