- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటీసులు ఇవ్వడం పై బాధితుల ఆందోళన
హుజూర్నగర్ పట్టణంలోని ఊర చెరువు భూముల అంశం ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది

దిశ, హుజూర్ నగర్ టౌన్ : హుజూర్నగర్ పట్టణంలోని ఊర చెరువు భూముల అంశం ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చెరువు శిఖం భూములను ఆక్రమించారని ఆరోపణలతో తాసిల్దార్ కార్యాలయం నుండి పలువురికి నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.
నోటీసు జారీ ..
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఊర చెరువు సికం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించిన రెవిన్యూ అధికారులు ఆక్రమణదారులను పేర్కొంటూ పలువురికి నోటీసులు పంపారు 1905 నాటి భూ అక్రమ చట్టం సెక్షన్ ఏడు ప్రకారం ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి తగిన వివరణ కోరుతూ అధికారులు నోటీసులు ఇచ్చే అధికారం కలిగి ఉంటారు.
స్థానికుల ఆందోళన ..
తమకు నోటీసులు అందడంతో స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. తాము గత 60 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే నివసిస్తున్నామని తాము ఇంటి పన్నులు కూడా కడుతున్నామని, ఇల్లు కట్టుకోవడానికి విద్యుత్ కలెక్షన్ అనుమతులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి నివసిస్తున్న తమకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని ఇది తమ జీవితాన్ని, ఆశ్రయాన్ని దెబ్బతీస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏవరు అభ్యంతరం చెప్పలేదని ఇప్పుడు ఏకపక్షంగా రెవిన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఈ విషయంపై స్థానిక ప్రజలు తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన మేము సుదీర్ఘకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్న మా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించి మాసమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గత 60 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న మా పట్ల సానుభూతితో ఉండాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ బండ కవితకు వివరణ లేఖను అందజేశారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు ..
హుజూర్ నగర్‌లోని 240 సర్వే నెంబర్ పరిధిలోని ఊర చెరువు సుమారు 72 ఎకరాల 31 గుంటల చెరువు భూములను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా, ఊర చెరువులో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న 115 మంది లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఇళ్లలో కొంత భాగం చెరువు భూమిలోకి వస్తుందని తెలిసి ఆందోళనకు గురైన స్థానికులు, తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
తహసిల్దార్ బండ కవిత వివరణ ..
తాము సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఊర చెరువు సర్వే నిర్వహించాము. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టి, సరిహద్దులను గుర్తించాము. ఇందులో భాగంగానే నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలు కావడంతో, అధికారులు సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే, ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు బాధితులు తదితరులు పాల్గొన్నారు.






