- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
by Batti.Sumithra |
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి వసంతరావు, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

X
దిశ, జగదేవపూర్ : వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి వసంతరావు, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండలంలోని అలీరాజ్ పేట్, బిజీ వెంకటాపూర్ గ్రామాలలో ఎల్ నినో పరిస్థితుల పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ క్షేత్రాలలో ఫామ్ పాండ్లు నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని సూచించారు. రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పరమేశ్వర్, రాచమల్ల ఎల్లేష్, ఏఈఓలు పాల్గొన్నారు.
Next Story






