Rashmika-Vijay: విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటాను.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-08 08:14:56  IST  )

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కలిసి మూడు చిత్రాల్లో నటించారు.

Rashmika-Vijay: విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటాను.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక(Rashmika), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కలిసి మూడు చిత్రాల్లో నటించారు. ఇక 2018 నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. గత నెల అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. నిశ్చితార్థం అయ్యాక ఈ కొత్త జంట దేవాలయాలకు కూడా వెళ్లారు. ఆ తర్వాత ఓ స్పెషల్ రింగ్ చూపిస్తూ రష్మిక చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంపై ఆ జంట మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో అంతా అయోమయంలో పడిపోయారు. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 26, 2026న జరగనుందని, వెన్యూ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక రాయల్ ప్యాలెస్‌లో అని చెబుతున్నారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్‌గా, సౌత్ ఇండియన్ మరియు రాజస్థానీ ట్రెడిషన్స్ మిక్స్‌తో గ్రాండ్‌గా ఉంటుందని టాక్. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రష్మిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అని ఓ అభిమాని అడగ్గా..‘‘డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నడుటోతో చేస్తాను. ఎందుకంటే నాకు నరుటో పాత్ర అంటే చాలా ఇష్టం అందుకే అతనితో డేట్ చేయాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటే కచ్చితంగా విజయ్‌నే చేసుకుంటా. నా విషయంలో మీరు అనుకుంటుంది నిజమే. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వెల్లడిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అనుకున్నంత పని చేశారుగా.. చేసుకొని సంతోషంగా ఉండండి అంటూ నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Read More..

ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తా యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..

ఆ క్యారెక్టర్‌తో నాకు డేట్ చేయాలని ఉంది : నేషనల్ క్రష్ రష్మిక

Next Story