- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తా యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో ఓ యంగ్ హీరోతో ఏడడుగులు వేయబోతున్నట్లు గత కొద్ది కాలంగా పుకార్లు షికారు చేస్తున్నారు.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో ఓ యంగ్ హీరోతో ఏడడుగులు వేయబోతున్నట్లు గత కొద్ది కాలంగా పుకార్లు షికారు చేస్తున్నారు. కొన్నేళ్లుగా విజయ్(Vijay Deverakonda)తో ప్రేమలో ఉండగా.. వచ్చే ఏడాది వీరు పెళ్లి బంధంతో ఒక్కటికాబోతున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ రష్మిక మాత్రం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పెళ్లి వార్తలపై హింట్ ఇస్తోంది. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారట అనే ప్రశ్న ఎదురవగా.. దానికి మీరు అనుకుంటుంది నిజమే అని అందరినీ అయోమయంలోకి నెట్టేసింది. తాజాగా, ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రష్మిక తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వెల్లడించింది.
‘‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి విషయాన్ని నా వైపు నుంచి ఆలోచిస్తూ నన్ను, నా పనిని అర్థం చేసుకునేవాడు కావాలి. ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి.. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే అతను అయితే బాగుంటుంది. మంచి వ్యక్తిత్వంతో పాటు నా కోసం యుద్ధం చేయగల సత్తా ఉండాలి. అలాంటి వ్యక్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా.. ఏమైనా చేస్తా. చివరకు యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పింది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. నెటిజన్లు విజయ్ గురించే చెప్పిందని చర్చించుకుంటున్నారు.
Read More..
చీరలో తళుక్కుమంటున్న స్టార్ హీరోయిన్.. అలాంటి పోస్ట్ పెట్టడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే...
ఆ క్యారెక్టర్‌తో నాకు డేట్ చేయాలని ఉంది : నేషనల్ క్రష్ రష్మిక






