చీరలో తళుక్కుమంటున్న స్టార్ హీరోయిన్.. అలాంటి పోస్ట్ పెట్టడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే...

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

చీరలో తళుక్కుమంటున్న స్టార్ హీరోయిన్.. అలాంటి పోస్ట్ పెట్టడంతో నెటిజన్ల రియాక్షన్ ఇదే...
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. అలాగే తన డ్యాన్సింగ్ స్టైల్‌తో అందరినీ ఫిదా చేసింది. అయితే ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. ఓ పక్క వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క తన స్టడీస్‌పై కూడా కాన్సట్రేట్ చేస్తూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన మాస్ జాతర మూవీ ప్రజెంట్ థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.

ఇదిలా ఉంటే.. శ్రీలీల సోషల్ మీడియాలో చేసే రచ్చ, ఆమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ ఫాలోవర్స్‌ను నిత్యం అట్రాక్ట్ చేస్తూ వివిధ స్టైల్‌లో డ్రెసెప్ అవుతూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని శారీ పిక్స్ షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ బ్లౌజ్, వైట్ కలర్ శారీలో మెరిసిపోయింది.అలాగే వివిధ రకాల ఆర్నమెంట్స్ పెట్టుకుని కనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు ఈ పాట నుండి మీకు ఇష్టమైన లైన్ ఏమిటి? అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ అమ్మడి పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హార్ట్ ఎమోజీతో తన ఫీలింగ్స్‌ను పంచుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story