- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్...
మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, పాపన్నపేట : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో గల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్ళినట్టు ఆయన తెలిపారు. అక్కడ మంజీరా నది నందు ఇసుక లోడ్ కలిగిన 3ట్రాక్టర్లు, ఇసుకను తరలించేందుకు ప్రయత్నించిన మరో 6 ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ట్రాక్టర్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో మంజీరా నదితో పాటు చెరువుల నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.






