- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్యలన్నీ సృష్టించే విలన్ అవ్వాలనుంది.. నెగటివ్ ఫేడ్స్‌పై మిథిలా షాకింగ్ కామెంట్స్
నాకు అమాయకంగా కనిపిస్తూనే విలనిజం పండించే ఒక నెగటివ్ పాత్ర చేయాలని ఉంది. అటువంటి ఛాలెంజింగ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నాను

దిశ, సినిమా: దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ హారర్ కామెడీ ‘భూత్ బంగ్లా’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అక్షయ్ కుమార్, టబు వంటి స్టార్లతో కలిసి నటించిన ఈ చిత్రంలో యువ నటి మిథిలా పాల్కర్ ఒక కీలక పాత్రలో మెరిసింది. అయితే, ఈ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందనే విషయంపై మిథిలా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్లు, మీటింగ్‌లు జరుగుతుంటాయి. కానీ మిథిలా విషయంలో మాత్రం దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె, నటి కళ్యాణి ప్రియదర్శన్ చేసిన సాయం పెద్ద మలుపు తిప్పింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిథిలా ఈ విషయంపై స్పందిస్తూ.. "నిజానికి కళ్యాణి నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా కలుసుకోలేదు. మేమిద్దరం ఫోన్ ద్వారానే స్నేహితులమయ్యాం. కళ్యాణి నా నటనపై ఉన్న నమ్మకంతో తన తండ్రికి నా పేరును సూచించడం నిజంగా గ్రేట్" అని చెప్పుకొచ్చింది.
ఇదే ఇంటర్వ్యూలో మిథిలా తన గత చిత్ర విశేషాలను కూడా పంచుకుంది. 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్' సినిమాలో డాన్స్ రాని అమ్మాయిగా నటించడం తనకు పెద్ద సవాలుగా మారిందని చెప్పింది. "నేను మ్యూజిక్ బాగా ఫాలో అవుతాను, అందుకే తాళం తప్పి డాన్స్ చేయడం నాకు చాలా కష్టమైంది. చివరకు కొరియోగ్రాఫర్ల సాయంతో ఆ సీన్లు పూర్తి చేశాను" అని నవ్వుతూ గుర్తు చేసుకుంది. కాగా.. త్వరలోనే మిథిలా పాల్కర్ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న 'సూపర్ సుబ్బు' అనే తెలుగు వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ.. "నాకు అమాయకంగా కనిపిస్తూనే విలనిజం పండించే ఒక నెగటివ్ పాత్ర చేయాలని ఉంది. అటువంటి ఛాలెంజింగ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నాను" అని తన మనసులో మాట బయటపెట్టింది.
స్టైలిష్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ






