Faria Abdullah: స్టైలిష్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-20 16:01:01  IST  )

ఫోటోలతో ఫైర్ రేపుతున్న ఫరియా అబ్దుల్లా... వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్.

Faria Abdullah: స్టైలిష్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో ఒకరైన ఫరియా అబ్దుల్లా 1998 మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో జన్మించింది. ఆమె తన విద్యాభ్యాసాన్ని హైదరాబాదులోనే పూర్తి చేసింది.

హైదరాబాదులోని లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదివిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన జాతి రత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఫరియా, ఇందులో చిట్టి పాత్రలో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్కసారిగా ఈ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు రావడం ప్రారంభమైంది. అయితే జాతి రత్నాలు తర్వాత నటించిన సినిమాలు పెద్ద స్థాయిలో విజయాన్ని అందించలేకపోయినా, ఫరియాకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఆమె చివరిగా గుర్రం పాపిరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఈ చిత్రం కూడా ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందంతో ఆకట్టుకునే ఈ పొడుగు కాళ్ల సుందరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

వాటిలో నీలి రంగు అల్ట్రా స్టైలిష్ డ్రెస్‌లో హాట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో కెమెరాకు పోజులు ఇచ్చింది. ఆ డ్రెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆమె కురులు అందాన్ని మరింతగా పెంచాయి. ఈ ఫోటోల్లో ఫరియా చాలా స్టైలిష్‌గా కనిపించడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

ఆయుష్మాన్ చిక్కుల్లో రకుల్ మ్యాజిక్..ఆసక్తికరంగా ‘పతి పత్ని ఔర్ వో దో’ టీజర్

Next Story