ఆయుష్మాన్ చిక్కుల్లో రకుల్ మ్యాజిక్..ఆసక్తికరంగా ‘పతి పత్ని ఔర్ వో దో’ టీజర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-20 11:35:13  IST  )

పతి పత్ని ఔర్ వో దో’ సినిమా టీజర్ తాజాగా.. విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రకుల్ తో పాటు సారా అలీ ఖాన్, వామికా గబ్బి కూడా నటిస్తున్నా, రకుల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆయుష్మాన్ చిక్కుల్లో రకుల్ మ్యాజిక్..ఆసక్తికరంగా  ‘పతి పత్ని ఔర్ వో దో’ టీజర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ప్రేక్షకులను నవ్వించేందుకు ‘పతివర్స్’ ప్రపంచం మళ్ళీ సిద్ధమైంది. ఈసారి ఈ పతీ-పత్నీల గందరగోళంలో మన టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మెరవబోతోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ‘పతి పత్ని ఔర్ వో దో’ సినిమా టీజర్ తాజాగా.. విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రకుల్ తో పాటు సారా అలీ ఖాన్, వామికా గబ్బి కూడా నటిస్తున్నా, రకుల్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీజర్‌ను చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ప్రసిద్ధ ‘మహాభారత’ సిరీస్‌లోని మై సమయ్ హూన్ అనే గంభీరమైన వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభం కాగా.. కాలం మారుతున్నా, యుగాలు గడుస్తున్నా భర్తల అవిశ్వాస స్వభావం మాత్రం మారదని చమత్కరిస్తూ.. గతంలో వచ్చిన సంజీవ్ కుమార్, కార్తీక్ ఆర్యన్ల క్లిప్పింగ్స్‌ను చూపించారు. ఇక చివరలో ఈ కొత్త తరం పతిగా ఆయుష్మాన్ ఖురానాను, ఆయన లైఫ్‌లోకి వచ్చే ‘వో’ (ఆమె) లలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ ను చూపించడం అదిరిపోయింది.

ఈ సినిమాలో రకుల్ పాత్ర చాలా సందడిగా, స్టైలిష్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆయుష్మాన్ ఖురానా ముగ్గురు అందగత్తెల మధ్య చిక్కుకుని పడే పాట్లు, ఆ గందరగోళంలో రకుల్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనున్నాయి. రకుల్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ ‘పతివర్స్’లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ టీజర్‌ను విడుదల చేస్తూ.. ‘‘కాలం అన్నింటినీ మారుస్తుంది...కానీ భర్తల స్వభావంపై దానికి కూడా ఏమాత్రం నియంత్రణ లేదు. ప్రజాపతి పాండే వస్తున్నాడు… ఈసారి, తన భార్యతోనూ, ఆ మరో ఇద్దరితోనూ కలిసి సందడి చేయనున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో, టి-సిరీస్,బి.ఆర్. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ కామెడీ చిత్రం మే 15న థియేటర్లలోకి రాబోతోంది. వేసవి సెలవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో, గ్లామర్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్టైలిష్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ

Next Story