- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
నిజంగా పని చేయాలనుకునే వారికి ఇలాంటివి ఎదురవ్వవు అని నేను భావిస్తాను. నా విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు కాబట్టి నేను అలా నమ్ముతాను.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన అభిప్రాయాలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించడమే కాకుండా, ఆమెను అజ్ఞాని అని పిలిచేలా చేశాయి. అసలు ఏం జరిగిందంటే.. హన్సిక ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో హోస్ట్ ఆమెను చిత్ర పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. దీనికి హన్సిక స్పందిస్తూ.. "నిజంగా పని చేయాలనుకునే వారికి ఇలాంటివి ఎదురవ్వవు అని నేను భావిస్తాను. నా విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు కాబట్టి నేను అలా నమ్ముతాను" అని అన్నారు. అంటే, తనకు ఆ చేదు అనుభవం ఎదురవ్వలేదు కాబట్టి, అసలు అలాంటి సమస్యే లేదన్నట్లుగా ఆమె మాట్లాడటం వివాదంలో చిక్కుకుంది. హోస్ట్ వెంటనే కలుగజేసుకుంటూ.. "మీకు ఎదురవ్వకపోయినంత మాత్రాన పరిశ్రమలో ఈ సమస్య లేదని కాదు కదా?" అని గుర్తు చేశారు.
దానికి హన్సిక, "దీని గురించి నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. అవును, దీన్ని మనం కాదనలేము కానీ నాకు దీనిపై అవగాహన లేదు" అని బదులిచ్చారు. హన్సిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆమె చాలా స్వార్థంగా, పక్కవారి కష్టాలను గుర్తించలేని స్థితిలో బతుకుతోందని విమర్శిస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. నాకు డయాబెటిస్ లేదు కాబట్టి, అసలు లోకంలో డయాబెటిస్ అనే వ్యాధే లేదు అన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి అని ఎద్దేవా చేశాడు. మరికొందరు ఆమెకు బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు అని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా, పని చేయాలనుకునే వారికి ఇలాంటివి జరగవు అని ఆమె అనడం, ఇండస్ట్రీలో వేధింపులకు గురైన బాధితులను అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు మరింత బాధ్యతగా ఉండాలని, తమకు ఎదురవ్వని సమస్య ప్రపంచంలోనే లేదని అనుకోవడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
యుష్మాన్ చిక్కుల్లో రకుల్ మ్యాజిక్..ఆసక్తికరంగా ‘పతి పత్ని ఔర్ వో దో’ టీజర్






