- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేణు స్వామి అలాంటి వాడని అనుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన విష్ణు ప్రియ!
విష్ణు ప్రియ (Vishnu Priya)యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: విష్ణు ప్రియ (Vishnu Priya)యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసి ‘పోవే పోరా’ (pove pora)గేమ్ షో పాపులారిటీని తెచ్చిపెట్టింది. యాంకర్‌గానూ కాకుండా.. నటిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించింది. ఇక రియాలిటీ షో బిగ్‌బాస్ లోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా, ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన జీవితంలో జరిగిన పలు సంఘటనలు పంచుకుంది. తన మార్ఫింగ్ వీడియోల వల్ల చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్మ కూడా చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కష్టసమయంలో.. వేణు స్వామి తనను ఆదుకున్నారని చెప్తూ ప్రశంసలు కురిపించింది.
గత కొద్ది రోజులుగా ఆయనపై విమర్శలు వస్తున్నా.. తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. తన తల్లి చనిపోయే సమయంలో.. హాస్పిటల్ బిల్లులు లక్షల్లో కట్టాల్సి ఉండగా.. అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియని పరిస్థితుల్లో వేణు స్వామి(Venu Swamy)ని చేశానని. వెంటనే ఆయన తనకు సాయం అందించారని తెలిపింది. ఆయన వల్లే డాక్టర్లు మూడు రోజులే బతుకుతుందని చెప్పిన తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని చెప్పి ఎమోషనల్ అయింది. నిజంగా ఆయన అంత సాయం చేస్తారని అనుకోలేదు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణు స్వామి అని పొగిడేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది గమనించిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. పూజలే చేయడమే కాదు.. సాయం కూడా చేస్తారా? అని అంటున్నారు.
Read More..
మేడారం జాతరపై వేణుస్వామి వివాదస్పద వ్యాఖ్యలు !
నటిగా నన్ను మరో మెట్టు పైన నిలబెట్టే ప్రాజెక్ట్ ఇది..ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: శ్రీలీల






