నటిగా నన్ను మరో మెట్టు పైన నిలబెట్టే ప్రాజెక్ట్ ఇది..ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: శ్రీలీల

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-16 04:26:35  IST  )

‘పెళ్లి సందడి’తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల(Sreeleela) ‘ధమాకా’ మూవీతో హిట్ అందుకుంది.

నటిగా నన్ను మరో మెట్టు పైన నిలబెట్టే ప్రాజెక్ట్ ఇది..ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: శ్రీలీల
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల(Sreeleela) ‘ధమాకా’ మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి క్రేజీ హీరోయిన్‌గా ఊహించని పాపులారిటీని దక్కించుకుంది. ఇక ఇటీవల ‘పుష్ప-2’ ఐటమ్ సాంగ్ కూడా చేసి బాక్సాఫీసును షేక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శ్రీలీల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. త్వరలో ఈ అందాల తార ‘పరాశక్తి’(Parashakti) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకార్తికేయన్ (Sivakarthikeyan) కెరీర్‌లో 25న ప్రాజెక్ట్ రాబోతుండటం విశేషం. ఇందులో రవి మోహన్, అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నారు.

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల తన పాత్ర ఎలా ఉండబోతుందో వివరించింది. ‘‘నిలదొక్కుకోవడానికి కొన్ని సినిమాలు చేస్తాం. కానీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలంటే కొన్ని చిత్రాలు చేయాలి. ఇన్నాళ్లూ నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికే సినిమాలు చేశాను. కానీ మొదటిసారి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే ప్రాజెక్ట్‌తో రాబోతున్నాను.

నా సినిమాలన్ని ఒకెత్తు అయితే.. ‘పరాశక్తి’ మాత్రం ఒకెత్తు. 60లో జరిగే కథగా రాబోతుంది. అప్పటి మధ్య తరగతి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్రను సుధా కొంగర అద్భుతంగా డిజైన్ చేశారు. పాతకాలం హీరోయిన్లను చూసిన ఫీలింగ్ నా పాత్రను చూస్తే కలుగుతుంది. ఆహార్యం, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సంఘర్షణలతో కూడుకున్న పాత్ర నాది. నటిగా నన్ను మరో మెట్టు పైన నిలబెట్టే సినిమా ‘పరాశక్తి’ అని భావిస్తున్నా’’ అని చెప్పింది.

Read More..

గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Next Story