మేడారం జాత‌ర‌పై వేణుస్వామి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు !

by velandi.Saikiran |

వేణు స్వామి, సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో

మేడారం జాత‌ర‌పై వేణుస్వామి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు. నిత్యం సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పిన వేణుస్వామి, అప్పటి నుంచి బాగా పాపులర్ అయిపోయారు. అయితే ఈ మధ్య జాతకాలు చెప్పడం తగ్గించిన వేణు స్వామి, సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటి మంది మేడారం జాతరకు వెళ్తారని వెల్లడించారు.

వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లిన వాళ్లే, మేడారం వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. మేడారం సమ్మక్క సారాలమ్మకు బంగారం ( బెల్లం) ఇచ్చిన తర్వాత, మేకలను కోసుకొని, మద్యపానం సేవిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక మేడారంలో కొన్ని లక్షల మేకలను బలిస్తారని వెల్లడించారు. ఆ జంతు బ‌లికి పెట్టిన‌ డబ్బులతో జూబ్లీహిల్స్ లో ఒక మంచి విల్లా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వేణు స్వామి బాంబు పేల్చారు.

అలాగే లిక్కర్ బాటిల్లు కూడా విపరీతంగా మేడారం జాతరలో తాగుతారని కూడా వివరించారు. నాన్ వెజ్ తినే భ‌క్తులు వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి వ‌స్తార‌ని కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా, తెలంగాణ వాళ్లను తాగుబోతులు అని అర్థం వచ్చేలా వేణుస్వామి కామెంట్స్ చేశారని ఫైర్ అవుతున్నారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story