ఎన్టీఆర్‌తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు : తేజ

by Dishaweb |
ఎన్టీఆర్‌తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు : తేజ
X

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకుడు తేజ ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘ఇప్పుడు ఉన్న జెనరేషన్‌లో రామ్ చరణ్ నాకు బాగా నచ్చాడు. ‘రంగస్థలం’ మూవీలో తన నటన బాగా నచ్చింది. అప్పటినుంచి అభిమానం ఏర్పడింది’ అని చెప్పాడు. ఇక తారక్‌తో సినిమా తీయాల్సి వస్తే మీరు ఎలాంటి కథ ఎంచుకుంటారు అని అడగడంతో.. ‘ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ అయితే నాకు లేదు’ అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు.

Read more:

NTR ఘాట్ వద్ద తారక్ వింత ప్రవర్తన.. నెట్టింట్లో విమర్శలు!

తెలంగాణ షీ టీమ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఫాలో కావాలంటున్న పోలీసులు!


Next Story

Most Viewed