తెలంగాణ షీ టీమ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఫాలో కావాలంటున్న పోలీసులు!

by Disha Web Desk 7 |
తెలంగాణ షీ టీమ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఫాలో కావాలంటున్న పోలీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణ కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఆకతాయిల చేతిలో నిత్యం లైంగిక వేధింపులకు గురవుతున్నారని గుర్తించిన రాష్ట్ర హోం శాఖ.. షీ టీమ్స్, సఖి, భరోసా, ఉమెన్స్ వింగ్ లాంటి టీములను ఏర్పాటు చేసింది. అలాగే ఆపదలో ఉన్న సమయంలో పోలీసులను, కుటుంబ సభ్యులను, స్నేహితులను అప్రమత్తం చేసేందుకు హాక్ ఐతోపాటు పలు రకాల యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ముఖ్యంగా షీ టీం వచ్చాక బస్సుల్లో, బస్టాండ్లలో, కాలేజీ ఏరియాల్లో యువతులపై ఈవ్‌టీజింగ్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. పోలీసుల ఆధ్వర్యంలో కాలేజీలు, పట్టణాల్లో షీ టీంపై అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు, యువతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. తాజాగా ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో షీ టీంను ఫాలో కావాలని ఓ వినూత్న వీడియోను షేర్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో..’ మూవీలోని ఫాలో ఫాలో.. పాటను పోస్ట్ చేసి షీ టీమ్‌ను ఫాలో కావాలని కోరారు. ఈ మేరకు ‘‘Just a gentle reminder! @TS_SheTeams are watching you!’’ అంటూ కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే దీనిని 33 వేల మంది లైక్ చేయడంతోపాటు రీ ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read..

అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్.. వీడియో వైరల్


Next Story

Most Viewed