NTR ఘాట్ వద్ద తారక్ వింత ప్రవర్తన.. నెట్టింట్లో విమర్శలు!

by Disha Web Desk 2 |
NTR ఘాట్ వద్ద తారక్ వింత ప్రవర్తన.. నెట్టింట్లో విమర్శలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాటు కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాత సమాధిపై పూలు చల్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాధి వద్దకు చేరుకున్న జూనియర్ కు సమాధిపై ఉంచేందుకు పక్కనే ఉన్న ఓ వ్యక్తి పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా దానిని పక్కకు తోసివేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పుష్పగుచ్చం ఇస్తున్న వ్యక్తిని సైతం పక్కకు నెట్టేసిన జూనియర్.. అనంతరం ఎన్టీఆర్ అక్కడ ఉన్న పూలను సమాధిపై చల్లి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు భక్తిలేదు ఏమీ లేదు ఏదో రావాలనే వచ్చాడని కొంత మంది విమర్శిస్తుంటే.. పుష్పగుచ్చం ఇచ్చింది ఓ టీడీపీ నాయకుడని అందువల్లే ఆ వ్యక్తిని జూనియర్ ఖాతరు చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.

సీఎం.. సీఎం అంటూ నినాదాలు:

అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ వద్ద కోలాహలం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్స్ చేసిన నినాదాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఘాటు వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలు డీటీపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ఉత్సవాలకు ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి జూనియర్ గైర్హాజరు అయ్యారు. ఓ వైపు మహానాడు జరుగుతున్న సమయంలో జూనియర్ ను సీఎం అంటూ ఆయన అభిమానులు ఇచ్చిన స్లొగన్స్ ఆసక్తిగా మారాయి.

Also Read:

ఎన్టీఆర్‌తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు : తేజ

ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అగ్రగామి: నందమూరి బాలకృష్ణ


Next Story

Most Viewed